Sat Mar 07 2026 20:43:33 GMT+0530 (India Standard Time)
నేడు చీరాలకు చంద్రాబాబు...చేనేతలకు గుడ్ న్యూస్
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు చీరాలకు వెళ్లనున్నారు. చేనేత జాతీయ దినోత్సవం కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు చీరాలకు వెళ్లనున్నారు. చేనేత జాతీయ దినోత్సవం కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఈ సందర్బంగా చేనేత కార్మికులకు శుభవార్త చెప్పే అవకాశముంది. రాయితీలతో పాటు వారికి ప్రత్యేకంగా పింఛనుతో పాటు కొన్ని సౌకర్యాలపై చంద్రబాబు ఈ సందర్భంగా ప్రకటన చేసే అవకాశముంది.
చేనేత జాతీయ దినోత్సవం...
చంద్రబాబు నాయుడు మంత్రివర్గ సమావేశం పూర్తయిన వెంటనే ఆయన హెలికాప్టర్ లో బయలుదేరి గుంటూరు జిల్లా బాపట్ల జిల్లా వేటపాలెంకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో చీరాలలోని జంద్రాపేటలో బీవీ అండ్ బీఎన్ హైస్కూల్ గ్రౌండ్ కు చేరుకుంటారు. అక్కడ బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం చేనేత కార్మికల గృహాలకు స్వయంగా వెళతారు.
Next Story

