Fri Dec 05 2025 10:19:21 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : జీఎస్టీ స్లాబ్ ల తగ్గింపుపై చంద్రబాబు ట్వీట్
జీఎస్టీ స్లాబ్ ల తగ్గింపుపై కేంద్రం తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు ట్వీట్ చేశారు

జీఎస్టీ స్లాబ్ ల తగ్గింపుపై కేంద్రం తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు ట్వీట్ చేశారు. జీఎస్టీ స్లాబ్ లను మారుస్తూ తీసుకువచ్చిన సంస్కరణల్ని స్వాగతిస్తున్నట్టు ట్వీట్ చేసిన చంద్రబాబు నిత్యావసరాలు, విద్యా, ఆరోగ్యరంగం, వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించిన పన్నులు గణనీయంగా తగ్గుతాయని చంద్రబాబు పేర్కొన్నారు.
పేదలకు వరంగా...
ఈ నిర్ణయం పేదలకు వరంగా, అభివృద్ధి కారకం. సమాజంలోని వేర్వేరు వర్గాలకు ప్రత్యేకించి రైతుల నుంచి వ్యాపారుల వరకూ ప్రయోజనం కలుగుతుందనీ పేర్కొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు విప్లవాత్మక నిర్ణయం తీసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ల్ె అభినందనలు తెలియచేస్తున్నానని ట్వీట్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు.
Next Story

