Sat Jan 31 2026 13:10:06 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : మూడో రోజు చంద్రబాబు సింగపూర్ పర్యటన
సింగపూర్ పర్యటనలో మూడో రోజు పారిశ్రామిక వేత్తలతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం కానున్నారు

సింగపూర్ పర్యటనలో మూడో రోజు పారిశ్రామిక వేత్తలతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం కానున్నారు. ఈరోజు పదికి కి పైగా సమావేశాల్లో చంద్రబాబు పాల్గొనున్నారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఫిన్టెక్ రంగాలకు చెందిన కంపెనీల ప్రతినిధులతో వరస సమావేశాలను చంద్రబాబు నిర్వహించనున్నారు. క్యారియర్, విల్మర్, టీవీఎస్, మురాటా సంస్థల ప్రతినిధులతో చర్చలు జరపనున్నారు.
వివిధ సంస్థలతో...
యూట్యూబ్ అకాడమీతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకోనుంది. సింగపూర్ అధ్యక్షుడు థర్మన్ షణ్ముగ రత్నం, మాజీ ప్రధాని లీ హ్సియన్ లూంగ్ తోనూ ముఖ్యంత్రి చంద్రబాబు భేటీ కానున్నారు. గూగుల్ క్లౌడ్ ప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తారు. ఆంధ్రప్రదేశ్లో డేటా సెంటర్లు, గ్రీన్ ఎనర్జీ ఆధారిత, క్లౌడ్ ఆధారిత సేవలు, డిజిటల్ ఇండియా లక్ష్యాలపై గూగుల్ క్లౌడ్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి సమావేశమవుతారు. మధ్యాహ్నం జురాంగ్ పెట్రోకెమికల్ ఐలాండ్ ను ముఖ్యమంత్రి, మంత్రుల బృందం సందర్శించనుంది.
Next Story

