Fri Dec 05 2025 21:52:26 GMT+0000 (Coordinated Universal Time)
TDP : బితుకు బితుకుమంటూనే ఎమ్మెల్యేలు... వారికి స్ట్రాంగ్ వార్నింగ్ తప్పదటగా?
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ ఆరుగురు ఎమ్మెల్యేలకు నేడు క్లాస్ పీకే అవకాశం కనిపిస్తుంది

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ ఆరుగురు ఎమ్మెల్యేలకు నేడు క్లాస్ పీకే అవకాశం కనిపిస్తుంది. సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం కావడమే కాకుండా పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చి పెట్టేలా వ్యవహరించే ఎమ్మెల్యేలను సమావేశంలోనే సీరియస్ వార్నింగ్ ఇచ్చే అవకాశాలున్నాయి. ఇప్పటికే ఆ ఆరుగురు ఎమ్మెల్యేలకు సంబంధించిన విషయాలను నివేదిక రూపంలో చంద్రబాబు నాయుడు తెప్పించుకున్నట్లు తెలిసింది. ఈరోజు ఉండవల్లిలోని చంద్రబాబు నాయుడు నివాసంలో టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులు, పొలిట్ బ్యూరో సభ్యులతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశాల్లో రాష్ట్ర కమిటీ గురించి చర్చ అని చెబుతున్నప్పటికీ ఎమ్మెల్యేల వ్యవహార శైలిపైనే చంద్రబాబు చాలాసేపు మాట్లాడే అవకాశముందని తెలిసింది.
ఎమ్మెల్యేల వైఖరిపై...
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఎమ్మెల్యేల వైఖరిపై చర్చ జరుగుతోంది. కొందరు ఎమ్మెల్యేలు వరస వివాదాల్లో ఇరుక్కుంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే సీరియస్ అయ్యారు. కొందరిని పిలిచి వార్నింగ్ ఇచ్చారు. మరికొందరిపై కేసులు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించారు. ఈరోజు జరిగే సమావేశంలో కూడా మంత్రులు, ఎమ్మెల్యేలకు కీలక సూచనలు చేసే అవకాశం కనిపిస్తుంది. ఒక రకంగా స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇవ్వనున్నారు అని ప్రచారం జరుగుతుంది.ఎమ్మెల్యేల వైఖరి రిపీటెడ్ గా ఇలా ఉంటే.. ఇటు ప్రభుత్వం అటు పార్టీకి చెడ్డపేరు తెచ్చే ఛాన్స్ ఉందనే చర్చ జరుగుతోంది. ఇలాంటి సమయంలో కీలక భేటీ నిర్వహించి నేతలకు ముఖ్యమంత్రి గట్టిగా చెప్పనున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
ఈ ఎమ్మెల్యేలను...
జిల్లా ఇంఛార్జ్ మంత్రులకు ఎమ్మెల్యేల బాధ్యత అప్పగించనున్నారని తెలిసింది. ఇదే పరిస్థితి ఇలా కొనసాగితే భవిషత్త్ లో ఇబ్బందులు వస్తాయని చంద్రబాబు అలర్ట్ అయ్యారు. ఎమ్మెల్యేలు బుడ్డా రాజశేఖర్ రెడ్డి, కూన రవికుమార్, కొలికపూడి శ్రీనివాస్, అబ్దుల్ నజీర్, దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ లతో పాటు ఒక మహిళ ఎమ్మెల్యేకు కూడా చంద్రబాబు క్లాస్ పీకే అవకాశాలున్నాయి. దీంతో ఎమ్మెల్యేలు చంద్రబాబు ఏమంటారోనన్న భయంతో అమరావతికి చేరుకుంటున్నారు.ఇకపై ఎలాంటి వివాదాల్లో చిక్కుకున్నా పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని తీవ్రమైన హెచ్చరికలను చంద్రబాబు జారీ చేసే అవకాశముంది. వచ్చే ఎన్నికల్లోనూ టిక్కెట్ దొరకదని ఆయన కుండబద్దలు కొట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Next Story

