Sat Dec 06 2025 02:01:35 GMT+0000 (Coordinated Universal Time)
యోగాంధ్ర సూపర్ హిట్ : చంద్రబాబు
యోగాంధ్ర సూపర్‌హిట్ అయిందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు.

యోగాంధ్ర సూపర్‌హిట్ అయిందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. విశాఖ పట్నంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ విశాఖలో యోగాంధ్రకు రెండు గిన్నిస్ రికార్డులు వచ్చాయన్నారు. నిన్న గిరిజన విద్యార్థుల సూర్యనమస్కారాలకు గిన్నిస్ రికార్డులో స్థానం లభించిందని చంద్రబాబు చెప్పారు.ఈరోజుదేశవ్యాప్తంగా 10కోట్లమంది యోగాలో పాల్గొన్నారని, 11వ యోగా డే విశాఖ డిక్లరేషన్ తీసుకొస్తామని తెలిపారు. యోగా పరిషత్‌ను ఏర్పాటు చేస్తామన్న చంద్రబాబుతెల్లవారుజామునే 3 లక్షల 3 వేల 654 మంది విశాఖ బీచ్ వద్దకు వచ్చారన్నారు. క్యూఆర్ కోడ్ ప్రకారం ఇంతమంది వచ్చినట్లు గుర్తించామని చంద్రబాబు చెప్పారు.
రెండు గిన్నీస్ రికార్డులు...
22 వేల 122 మంది గిరిజన విద్యార్థులు 108 సూర్య నమస్కారాలు 108 నిమిషాలు చేసి చరిత్ర సృష్టించారని చంద్రబాబు వివరించారు. మొదటిసారి రెండు గిన్నిస్ రికార్డులు నమోదయ్యాయని చెప్పారు. రాష్ట్రంలో రిజిస్ట్రేషన్లు 2 కోట్ల 45 లక్షల మంది చేసుకున్నారని, 25 లక్షల సర్టిఫికెట్లు ఇద్దామనుకుంటే కోటీ 80 లక్షల మంది పాల్గొన్నారన్నారు. యోగా అందరిదీ అని చెప్పిన ప్రధాని మోదీకి అభినందనలన్న చంద్రబాబు విశాఖలో యోగాంధ్ర నిర్వహించేందుకు కేబినెట్ సబ్ కమిటీ వేసి పని చేశామన్నారు. అధికార యంత్రాంగం అత్యుత్తమంగా పని చేసిందని కొనియాడారు. హుద్ హుద్ తుఫాన్ విపత్తులో అప్పటి ఎన్డీయే ప్రభుత్వం చేసిన పనికి ప్రధాని అభినందించారు
Next Story

