Tue Jan 20 2026 04:58:04 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : విపత్తు సమయంలో అందరం ఒక్కటయ్యాం
విజయవాడ వరదల సమయంలో అందరం ఒక్కటై సమిష్టిగా పనిచేసి బాధితులను ఆదుకున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు

విజయవాడకు వరదలు వచ్చిన సమయంలో అందరం ఒక్కటై సమిష్టిగా పనిచేసి బాధితులను ఆదుకున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈరోజు విజయవాడలో వరద బాధితులకు ఆర్థిక సాయం అందించే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వరదబాధితులకు నాలుగు లక్షల కుటుంబాలకు 602 కోట్ల రూపాయలను వారి ఖాతాల్లో జమ చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 42 సెంటీమీటర్ల వర్షం కురిసిందన్నారు.
పది రోజులు ఇక్కడే ఉండి...
అయితే తాను పది రోజులు ఇక్కడే ఉండి ప్రాణ నష్టం ఎక్కువ జరగకుండా అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపారు. అధికారులు, మంత్రులు కూడా బాగా పనిచేశారని కితాబిచ్చారు. ముఖ్యమంత్రి సహాయ నిధికి నాలుగు వందల కోట్ల రూపాయల విరాళాలు రావడం చరిత్ర అని చంద్రబాబు అన్నారు. వరద నీరు ప్రవహిస్తున్న సమయంలో మంచినీరు, ఆహారాన్ని బాధితులకు అందించగలిగామన్నారు. అత్యాధుని సౌకర్యాలను ఉపయోగించామని చంద్రబాబు చెప్పుకొచ్చారు. గత పాలకుల చేసిన పాపం కారణంగానే ఈ విపత్తు సంభవించిందని చంద్రబాబు అన్నారు.
Next Story

