Fri Dec 05 2025 16:13:05 GMT+0000 (Coordinated Universal Time)
కుప్పం కు హంద్రీనీవా నీళ్లు : చంద్రబాబు
కుప్పంలో చివరి ఆయకట్టు వరకూ నీళ్లు తీసుకువస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు

కుప్పంలో చివరి ఆయకట్టు వరకూ నీళ్లు తీసుకువస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. కుప్పం ప్రజావేదిక సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగించారు. స్వర్ణ కుప్పం ప్రాజెక్టులో అభివృద్ధి , సంక్షేమ కార్యక్రమాల ప్రారంభం అనంతరం మాట్లాడిన చంద్రబాబు నాయుడు విధ్వంసం చేసిన రాష్ట్రాన్ని వికాసం వైపుగా నడుపుతున్నామన్నారు. సుపరిపాలనలో తొలి అడుగులో భాగంగా మీ ముందుకు వచ్చానని, దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా కుప్పాన్ని తయారు చేస్తామని తెలిపారు. 3890 కోట్ల రూపాయల వ్యయం చేసి హంద్రినీవా పనులు పూర్తి చేస్తున్నామని తెలిపారు. ఈ ఏడాదిలోనే కుప్పం నియోజకవర్గానికి హంద్రీనీవా నీళ్లు పారిస్తామని చెప్పిన చంద్రబాబు అభివృద్ధి చేసే వారికి మాత్రమే సంక్షేమం గురించి మాట్లాడే హక్కు ఉంటుందన్నారు.
అప్పులు చేసి సంక్షేమమా?
అప్పు చేసి సంక్షేమం చేస్తామనటం ఏం పరిపాలన అని ప్రశ్నించారు. అప్పు తెచ్చి అభివృద్ధి చేసి వచ్చిన ఆదాయాన్ని సంక్షేమానికి ఖర్చు చేయటమే నిజమైన ఆర్ధిక వ్యవస్థ అని చంద్రబాబు అన్నారు. గతేడాదిగా రాష్ట్రంలో ఈ విధానాన్నే అవలంబిస్తున్నామన్న చంద్రబాబు ప్రజలంతా ఆశీర్వదించబట్టే ఏడాదిగా సుపరిపాలనను రాష్ట్రంలో అందిస్తున్నామని తెలిపారు. కుప్పంలో రూ.1292 కోట్ల రూపాయల విలువైన పనుల్ని చేస్తున్నామని, ఇప్పటికే రూ.125 కోట్ల విలువైన పనులు కూడా పూర్తి అయ్యాయని, రాష్ట్రంలో గుంతలు లేని రహదారులే లక్ష్యంగా పని చేశామని చెప్పారు. స్వర్ణ కుప్పం ప్రాజెక్టులో భాగంగా రహదారులను సీసీ, బీటీ రోడ్లుగా మారుస్తున్నామని, కుప్పం నియోజకవర్గంలో ప్రతీ ఇంటిలోనూ వంట గ్యాస్ ఉందని తెలిపారు.
Next Story

