Wed Dec 17 2025 12:53:33 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : ఐదోసారీ నేనే ముఖ్యమంత్రి.. ఇది కన్ఫర్మ్
తాను ఐదోసారి ముఖ్యమంత్రిగా వస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు

తాను ఐదోసారి ముఖ్యమంత్రిగా వస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు 4.0లో వెర్షన్ వన్ ఇప్పుడు ప్రారంభమైందన్న చంద్రబాబు డిసెంబర్ నుంచి అమరావతి పనులు ప్రారంభం అవుతాయని తెలిపారు. ఆరు నెలల్లో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కార్టర్లతో పాటు ఐఏఎస్ అధికారుల క్వార్టర్ల నిర్మాణాన్ని పూర్తి చేస్తామని శాసనసభ సాక్షిగా సభలో వెల్లడించారు.
మూడేళ్లలో అమరావతికి...
మూడేళ్లలో అమరావతికి ఓ రూపం తెస్తామని తెలిపిన చంద్రబాబు 2027నాటికి పోలవరం పూర్తి చేస్తామన్నారు. డిసెంబర్ నుంచి తాను కూడా గేర్ మార్చుకుంటానని, తనతో కలసి ఎమ్మెల్యేలు కూడా పని చేయాలని ఆయన కోరారు. అమరావతి నిర్మాణం పూర్తయి ఉంటే ఏడాదికి రూ.10 నుంచి రూ.15 వేల కోట్లు వచ్చేవంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు.
Next Story

