Wed Jan 21 2026 01:26:39 GMT+0000 (Coordinated Universal Time)
పవన్ వ్యాఖ్యలపై కేబినెట్ లో చంద్రబాబు ఏమన్నారంటే?
ఇటీవల పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు

ఇటీవల పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. గత ప్రభుత్వం వల్లనే పోలీసులు ఇలా తయారయ్యారని చంద్రబాబు అన్నారు. మంత్రి వర్గ సమావేశంలో పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై చంద్రబాబు నాయుడు మాట్లాడారు. నెలరోజుల్లో పోలీసు వ్యవస్థను తాను గాడిలో పెడతానని తెలిపారు. మంత్రి వర్గ సమావేశంలో పవన్ కల్యాణ్ తాను చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. కొందరు పోలీసు అధికారులు గతంలో మాదిరిగానే వ్యవహరిస్తున్నారన్నారు.
నెలరోజుల్లో వ్యవస్థను...
తాను ఫోన్ చేసినా సక్రమంగా స్పందించలేదన్నారు. పోలీసు వ్యవస్థను గాడిలో పెట్టకుంటే కూటమి ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర అసంతృప్తికి గురవుతానని తాను అలా వ్యాఖ్యానించవలసి వచ్చిందని పవన్ కల్యాణ్ వివరించారు. దీనికి చంద్రబాబు కూడా అంగీకరించారు. కొంత వ్యవస్థలో మార్పులు తీసుకు రావాల్సిన అవసరం ఉందని చంద్రబాబు అన్నారు. గత ప్రభుత్వంలో ఉన్న పోలీసు ఉన్నతాధికారులను మారుస్తామని తెలిపారు. పనితీరు మార్చుకోకుంటే తాను వారిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతానంటూ హెచ్చరించారు చంద్రబాబు. సోషల్ మీడియాలో పదే పదే పోస్టులను వైసీపీ నేతలు పెడుతున్నా, వారిపై చర్యలు తీసుకోవడం లేదని పవన్ తెలిపారు. అలాంటి వారిని కూడా ఉద్వాసన చెబుదామని చంద్రబాబు అన్నారు.
Next Story

