Tue Dec 16 2025 23:44:48 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : రాజధానిలో పేదల ఇళ్లస్థలాలపై చంద్రబాబు కీలక ప్రకటన
రాజధాని అమరావతిలోని ఆర్ 5 జోన్ లో కేటాయించిన ఇళ్ల స్థలాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు

రాజధాని అమరావతిలోని ఆర్ 5 జోన్ లో కేటాయించిన ఇళ్ల స్థలాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్ 5 జోన్ లోకి ఇతర ప్రాంతాల నుంచి లబ్దిదారులను ఎంపిక చేసి తెచ్చారన్నారు. వేర్వేరు జిల్లాలు, నియోజకవర్గాల నుంచి ఇక్కడకు తెచ్చి ఇళ్లపట్టాలు ఇచ్చారని ఆయనఅన్నారు. ఆర్ 5జోన్ లో వారికి ఇళ్ల కేటాయింపు జరగదని తెలిపారు.
ప్రత్యామ్నాయంగా...
వారికి ప్రత్యామ్నాయంగా వేరే చోట భూమిని సేకరించి ఇళ్ల స్థలాలు ఇస్తామని తెలిపారు. అలా కాకుంటే వారికి టిడ్కో ఇళ్లను నిర్మించి ఇస్తామని తెలిపారు. ఆర్ 5జోన్ లోమాత్రం ఇళ్ల స్థలాలను కేటాయించలేమని ఆయన తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం ఆర్ 5 జోన్ లో పేదలకు ఇళ్ల స్థలాలనుకేటాయించిన నేపథ్యంలో చంద్రబాబు కీలక ప్రకటన చేశారు.
Next Story

