Fri Dec 05 2025 14:57:06 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : కాపు మహిళలకు చంద్రబాబు ప్రత్యేక కానుక
కాపు సామాజికవర్గానికి చెందిన మహిళలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుడ్ న్యూస్ చెప్పారు

కాపు సామాజికవర్గానికి చెందిన మహిళలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుడ్ న్యూస్ చెప్పారు. మహిళా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కానుకను అందించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజక వర్గాల్లోనూ బీసీ, ఈడబ్ల్యూఎస్, కాపు సామాజిక వర్గానికి చెందిన 1,02,832 మహిళా లబ్ధిదారులకు కుట్టు మిషన్లు అందజేయాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం 255 కోట్ల రూపాయలను ప్రభుత్వం వెచ్చిస్తోంది. బీసీ వెల్ఫేర్ కార్పొరేషన్ ద్వారా 46,044 మందికి, ఈడబ్లూఎస్ సామాజిక వర్గానికి చెందిన 45,772 మందికి, కాపు కార్పొరేషన్ ద్వారా అదే సామాజిక వర్గానికి చెందిన 11,016 మందిని ఎంపిక చేయనున్నారు. ఇప్పటికే లబ్ధిదారుల ఎంపిక కార్యక్రమం చివరి దశకు చేరుకుంది.
90 రోజుల పాటు శిక్షణ...
మహిళలకు భవిష్యత్తుపై భరోసా లభించేలా టైలరింగ్ లో శిక్షణ ఇవ్వాలని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నిర్ణయించింది. మూడు నెలల పాటు టైలరింగ్ లో ఉచిత శిక్షణ కొనసాగనుంది. టైలరింగ్ లో నిష్ణాతులైన వారితో మహిళలకు శిక్షణ ఇవ్వనున్నారు. నేటి ఫ్యాషన్ కు అనుగుణంగా దుస్తుల తయారీలో ఈ శిక్షణ కొనసాగనుంది. శిక్షణ అనంతరం లబ్ధిదారులకు ఉచితంగా కుట్టుమిషన్లు అందజేయనున్నారు. శిక్షణ ద్వారా ప్రావీణ్యం పొందిన మహిళలు సొంతంగా ఆదాయ ఆర్జిస్తూ, తమ కుటుంబాలకు తద్వారా సమాజానికి ఆసరాగా నిలవ్వాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచన
Next Story

