కలెక్టర్లూ.. జిల్లా రూపు రేఖల్ని మార్చండి : చంద్రబాబు
జిల్లా కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రసంగించారు.

కూటమి ప్రభుత్వం పదిహేను నెలల పాలన పూర్తి చేసుకుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. జిల్లా కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రసంగించారు. భారత్ నెంబర్ 1 కావాలన్న ఆకాంక్షతోనే ప్రధాని మోదీ పనిచేస్తున్నారని, భారత ఆర్ధిక వ్యవస్థ 11వ స్థానం నుంచి 4 స్థానానికి చేరుకుందని తెలిపారు. గతంలో అమెరికాను అగ్రస్థానంలో చూసేవాళ్లం. ఇప్పుడు భారత్ ఆ దేశానికి సమాన స్థాయికి వెళుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. మరో 22 ఏళ్లలో స్వాతంత్ర్యం వచ్చి వందేళ్లు పూర్తి అవుతుందని, ఆ సమయానికి భారత్ కూడా అగ్రస్థానానికి చేరుకుంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. సంస్కరణలు వద్దన్న చాలా రాజకీయ పార్టీలు మనుగడలో లేకుండా పోయాయన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వానిది ఓ నిర్దుష్టమైన విధానం ఉందని తెలిపారు. కేంద్రం 2047 వికసిత్ భారత్ ప్రణాళిక తయారుచేస్తే ఏపీ 2047 స్వర్ణాంధ్ర విజన్ రూపొందించిందని, ఇది అధికారులందరికీ భగవద్గీత, బైబిల్, ఖురాన్ కావాలని కోరారు. సీఎస్, డీజీపీల నుంచి క్షేత్రస్థాయి వరకూ సరైన వ్యక్తి సరైన చోట ఉండాలనే లక్ష్యంతో నియమాకాలు చేశామన్న చంద్రబాబు సామాజిక న్యాయానికి పెద్ద పీట వేస్తూ మంత్రులను నియమించి కేబినెట్ కూర్పు చేశామని చెప్పారు.

