Tue Jan 20 2026 21:31:59 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : తొలి అడుగు విజయయాత్ర 23 నుంచి
ఈ నెల 23 నుంచి నెల రోజుల పాటు ఇంటింటికీ ‘తొలి అడుగు’ విజయయాత్రను నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపు నిచ్చారు

ఈ నెల 23 నుంచి నెల రోజుల పాటు ఇంటింటికీ ‘తొలి అడుగు’ విజయయాత్రను నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపు నిచ్చారు.పార్టీ సంస్థాగత కమిటీలు త్వరగా పూర్తి చేయాలని, పార్టీ కోసం పని చేసేవారికి చోటు కల్పించాలని నేతలను చంద్రబాబు ఆదేశించారు. జూలైలో పార్టీ నేతలు, కార్యకర్తలకు నాయకత్వ శిక్షణా శిబిరాలుంటాయని చెప్పారు.
పార్టీకి కొంత సమయం ఇవ్వాలని...
ఎమ్మెల్యేలు రోజూ పార్టీకి కొంత సమయం కేటాయించాలని, ఈరోజు లక్ష చోట్ల నిర్వహించే యోగా డే సన్నాహక కార్యక్రమంలో పాల్గొనాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. తల్లికి వందనం నిధులు విడుదలతో సర్వత్రా సంతృప్తి నెలకొందని, వచ్చేవారమే అన్నదాత సుఖీభవ పథకం అమలు చేస్తామని, ఒకే నెలలో రెండు సూపర్ - 6 పథకాలు అమలు చేసి చూపిస్తున్నామని తెలిపారు. టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యనేతలు, గ్రామస్థాయి కార్యకర్తలతో టెలీకాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు.
Next Story

