Mon Dec 15 2025 22:50:03 GMT+0000 (Coordinated Universal Time)
మిర్చిరైతుల ఇబ్బందులపై నేడు కేంద్రం వద్దకు చంద్రబాబు పంచాయతీ
మిర్చి ధరలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ధరలు పడిపోవడంపై ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు.

మిర్చి ధరలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ధరలు పడిపోవడంపై ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు. మిర్చి రైతుల ఇబ్బందులనుమరోసారి కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. మిర్చి రైతుకు ఎంత ధర ఇస్తే గిట్టుబాటు అవుతుందో తనకు నివేదిక ఇవ్వాలని, తాను కేంద్రంతో మాట్లాడతానని చంద్రబాబు తెలిపారు.
ధరల పతనంపై...
మిర్చి ధర పతనంపై ఇప్పటికే కేంద్రానికి లేఖలు రాశామన్న చంద్రబాబు మరోసారి చర్చిస్తామని తెలిపారు. ఈరోజు చంద్రబాబు ఢిల్లీ పర్యటన నేపథ్యంలో..కేంద్ర వ్యవసాయశాఖ మంత్రిని కలిసి చర్చించే అవకాశం ఉందని, సాయత్రం 4.30 గంటలకు ఢిల్లీకి బయలుదేరి వెళుతున్న చంద్రబాబు మిర్చి రైతుల సమస్యలను వ్యవసాయ శాఖ మంత్రికి తెలపనున్నారు.
Next Story

