Thu Mar 26 2026 23:26:45 GMT+0530 (India Standard Time)
Chandrababu : అనంతపురం రామాలయ రథం దగ్దం ఘటనపై చంద్రబాబు సీరియస్
అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో రాములోరి రథం దగ్దం అయిన ఘటనపై చంద్రబాబు సీరియస్ అయ్యారు. అత్యవసర విచారణకు ఆదేశించారు.

అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో రాములోరి రథం దగ్దం అయిన ఘటనపై చంద్రబాబు సీరియస్ అయ్యారు. అత్యవసర విచారణకు ఆదేశించారు. ఘటనస్థలికి వెళ్లాలని ఎస్సీ, కలెక్టర్లను ఆదేశించారు. సమగ్ర దర్యాప్తు చేపట్టి వెంటనే నిందితులను అరెస్ట్ చేయాలని చంద్రబాబు పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు.
గుర్తు తెలియని వ్యక్తులు...
అనంతపురం జిల్లాలో రామాలయంలో ఉన్న రథాన్ని గుర్తు తెలియని వ్యక్తులు నిన్న దగ్దం చేశారు. ఈ ఘటన సంచలనం సృష్టించింది. కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు వెంటనే నాలుగు బృందాలుగా ఏర్పడి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. చంద్రబాబు కూడా అత్యవసర విచారణ చేపట్టాలని ఆదేశించడంతో డాగ్ స్వ్కాడ్, వేలిముద్రల నిపుణులు వచ్చి ఆధారాలను సేకరించే పనిలో ఉన్నారు. నిందితులను గుర్తించే పనిలో ప్రస్తుతం పోలీసులు విచారణ చేస్తున్నారు.
Next Story

