Fri Dec 05 2025 09:56:25 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : నాయుడు తగ్గారంటే అందుకు కారణముంది.. తెలుసుకోండి లీడర్లూ...?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎక్కడ తగ్గాలో.. ఎక్కడ నెగ్గాలో తెలిసిన నేత. ఆయన పార్టీని గత నాలుగు దశాబ్దాల నుంచి ఒంటిచేత్తో నడిపిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎక్కడ తగ్గాలో.. ఎక్కడ నెగ్గాలో తెలిసిన నేత. ఆయన పార్టీని గత నాలుగు దశాబ్దాల నుంచి ఒంటిచేత్తో నడిపిస్తున్నారు. నాలుగుసార్లు అధికారంలోకి తేగలిగారు. కూటమితో నెగ్గారని కొందరు విమర్శించవచ్చు కానీ, ఆ కూటమిలోని మిత్ర పక్షాల ఇగోలను సంతృప్తి పరుస్తూ, వారు నొచ్చుకోకుండా నిర్ణయాలు తీసుకుంటూ తాను అనుకున్న పనులు చేసుకుంటూ ముందుకు వెళ్లే నేతల్లో చంద్రబాబు నాయుడు ముందుంటారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడుకు రాజకీయాలు ఎలా ఉంటాయో తెలుసు. తమ బలం.. ఎదుటి వారి బలహీనత.. ప్రత్యర్థికి అందిపుచ్చుకునే అవకాశం ఇవ్వకపోడం వంటి వాటిల్లో చంద్రబాబును మించిన నాయకుడు మరొకరు ఉండరు.
కేంద్ర ప్రభుత్వంతోనూ...
నిజానికి ఎన్నడూ లేనిది కూటమి ప్రభుత్వానికి అధినేతగా ఉన్న చంద్రబాబు నాయుడు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. తన పరిధిలో ఉన్నంత వరకూ కూటమిలోని మిత్ర పక్షాలకు తగిన గౌరవంతో పాటు వారికి అవసరమైన అన్ని రకాలుగా పదవులు ఇవ్వడంలో చంద్రబాబు నాయుడు వెనకాడరు. కేంద్ర ప్రభుత్వంలో అధికారాన్ని పంచుకున్నా మోదీని ఇబ్బంది పెట్టకుండా తన మద్దతు అవసరం అని తెలిసినప్పటికీ కేవలం రెండు కేంద్ర మంత్రి పదవులతోనే సరిపెట్టుకున్న చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి అసవరమైన నిధులను, ప్రాజెక్టులను తేవడంలో కొంత సక్సెస్ అయ్యారు. సంక్షేమం, అభివృద్ధి సమపాళ్లలో జరగాలంటే కేంద్రంతో కయ్యం కంటే స్నేహం మంచిదని భావించి గొంతెమ్మ కోరికలకు పోకుండా తగ్గి ఉంటూ అన్నీ తెచ్చుకుంటున్నారు.
పవన్ కల్యాణ్ తో భేటీలో...
తాజాగా అసెంబ్లీలో జరిగిన పరిణామాలకు చంద్రబాబు నాయుడు బాధ్యుడు కారు. బొండా ఉమామహేశ్వరరావు కానీ, నందమూరి బాలకృష్ణ కానీ చేసిన వ్యాఖ్యలు కూటమిలోని మిత్రపక్షాలను ఇబ్బందిపెట్టే విధంగా ఉన్నాయి. అందుకే చంద్రబాబు నాయుడు తానే నడుంబిగించారు. నిన్న మధ్యాహ్నం మూడు గంటలకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇంటికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెళ్లారు. వైరల్ ఫీవర్ బాధపడుతూ హైదరాబాద్ లోని తన నివాసంలో ఉన్న పవన్ కల్యాణ్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరామర్శించారు. ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, నందమూరి బాలకృష్ణ చిరంజీవి పై చేసిన కామెంట్స్ పై కూడా ఆయన వివరణ ఇచ్చినట్లు తెలిసింది. పవన్ కల్యాణ్ మనసు నొచ్చుకోకుండా చంద్రబాబు తగ్గి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ ఏడు పదులు దాటిన వయసులో ఆయన తనవద్దకు రావడంతో పవన్ కల్యాణ్ కూడా కూల్ అయినట్లు తెలిసింది. దటీజ్ చంద్రబాబు.
Next Story

