Fri Jan 24 2025 15:40:25 GMT+0000 (Coordinated Universal Time)
మాతృభాషను మరవొద్దు
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ అమెరికాలో పర్యటిస్తున్నారు. మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో రమణ దంపతులు పాల్గొన్నారు
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ అమెరికాలో పర్యటిస్తున్నారు. మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో రమణ దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఎక్కడకు వచ్చినా మాతృభాషను మర్చిపోవద్దన్నారు. ఇంట్లో విధిగా తెలుగునే మాట్లాడాలని, పిల్లలతో కూడా తెలుగులోనే మాట్లాడాలని జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా తెలుగు వారు ఐక్యత కొనసాగించాలని జస్టిస్ ఎన్వీ రమణ పిలుపు నిచ్చారు.
ఉద్యోగాలు ఎందుకు రావు?
మాతృభాషలో చదివితే ఉద్యోగాలు రావడం కష్టమన్న భావన వద్దు అని జస్టిస్ రమణ అన్నారు. తాను మాతృభాషలోనే చదివానని ఆయన తెలిపారు. సొంత వారిని వదులుకుని ఇంత దూరంలో ఉంటున్నారని, అమెరికాలో దాదాపు ఏడు లక్షల మంది ఉన్నారని ఆయనఅన్నారు. తెలుగు సంస్కృతి సంప్రదాయాలను కాపాడుతున్నారని వారిని ఆయన ప్రశంసించారు. తెలుగుజాతి సురక్షితమని తాను భావిస్తున్నానని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా జస్టిస్ ఎన్వీ రమణ దంపతులకు అనేక మంది అమెరికాలో స్థిరపడిన తెలుగువారు సన్మానం చేశారు.
Next Story