Fri Dec 05 2025 14:44:53 GMT+0000 (Coordinated Universal Time)
బాల్య స్మృతులను గుర్తుచేసుకున్న జస్టిస్
తన చిన్నతనం ఇక్కడే గడిచిందని, కులాలు, మతాలకతీతంగా జీవనం సాగించేవారమని చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు

తన చిన్నతనం ఇక్కడే గడిచిందని, కులాలు, మతాలకతీతంగా జీవనం సాగించేవారమని చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. తన స్వగ్రామమైన పొన్నవరంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సభలో ఆయన ప్రసంగించారు. పొన్నవరం, కంచికచర్ల లోనే తన ప్రాధమిక విద్య కొనసాగిందని జస్టిస్ ఎన్వీరమణ తెలిపారు. 1960వ దశకంలోనే రాజకీయ చైతన్యం ఉన్న గ్రామ పొన్నవరం అని ఆయన అన్నారు.
తెలుగు జాతి అంతా....
తెలుగు జాతి అంతా ఒక్కటై ఉండాలని జస్టిస్ ఎన్వీ రమణ పిలుపునిచ్చారు. కష్టపడే తత్వం ఉన్న తెలుగు వాళ్లు ప్రపంచ దేశాల్లోనూ పేరు ప్రఖ్యాతులు గడుస్తున్నారన్నారు. తన చిన్ననాటి మిత్రులను కలవడం సంతోషంగా ఉందన్నారు. అందరినీ కలవడం ఆనందంగా ఉందని జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. ప్రజలంతా ఐక్యంగా ఉండి రాష్ట్రా భివృద్ధికి పాటుపడాలని జస్టిస్ ఎన్వీ రమణ పిలుపునిచ్చారు.
Next Story

