Thu Feb 05 2026 03:37:27 GMT+0000 (Coordinated Universal Time)
బ్యాక్ గ్రౌండ్ దద్దరిల్లుతోందిగా.. వీడి దుంపతెగ.. ఇంత మందితో సంబంధాలా?
చెరుకూరి వెంకటేష్ నాయుడు మామూలోడు కాదు. అన్ని పార్టీలు, సినిమా వాళ్లతో అతనికి సంబంధాలున్నాయని ఫొటోలు వెల్లడిస్తున్నాయి

వెంకటేష్ నాయుడు మామూలోడు కాదు. అన్ని పార్టీలు, సినిమా వాళ్లతో అతనికి సంబంధాలున్నాయని ఫొటోలు వెల్లడిస్తున్నాయి. అతను ఒక పవర్ బ్రోకర్ గా చెబుతున్నారు. దాదాపు 35 కోట్ల రూపాయల నగదు ను లెక్కించే వీడియో బయటపడటంతో ఎవరీ వెంకటేశ్ నాయుడు అన్న చర్చ జరుగుతుంది. వెంకటేశ్ నాయుడు చిత్తూరు జిల్లాకు చెందిన వ్యక్తి. అతను ప్రయివేటు ఫ్లైట్ లలో తిరుగుతూ పారిశ్రామికవేత్తలకు కావాల్సిన పనులు చేయించిపెడుతుంటాడు. ఎవరు అధికారంలో ఉంటే వారితో ఫొటోలు దిగడంతో పాటు వారిని మంచి చేసుకోవడం వెంకటేష్ నాయుడు కు వెన్నతో పెట్టిన విద్య. అయితే వెంకటేష్ నాయుడు లెక్కిస్తున్న 35 కోట్ల రూపాయల క్యాష్ ఎవరికి చెందిందన్న దానిపై లోతుగా సిట్ అధికారులు విచారిస్తున్నారు. లిక్కర్ కేసులో అరెస్టయిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అనుచరుడుగా ఉన్నారు.
రెండు వేల నోట్లు ఉండటంతో...
కానీ ఈ నోట్ల కట్టల్లో రెండు వేల రూపాయల నగదు కూడా ఉండటంతో ఇది ఎప్పుడు తీసిన వీడియో అన్న దానిపై చర్చ జరుగుతుంది. రెండు వేల కోట్ల రూపాయల నోట్ల రద్దయిన తర్వాత తీసిన ఫొటోనా? అంతకు ముందు తీసిన ఫొటానా? అని అనుమానిస్తున్నారు. ఎన్నికలకు ముందు నందిగామలో పట్టుబడిన క్యాష్ కూడా వెంకటేష్ నాయుడు నిందితుడిగా ఉన్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కు సంబంధించిన నగదా? లేక మరైదనా క్యాషా? అన్న కోణంలో సిట్ అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అన్ని రాజకీయ పార్టీల నేతలు, సెలబ్రిటీలతో సత్సంబంధాలు పెంచుకుంటూ నగదును మళ్లించడంలో వెంకటేష్ నాయుడు దిట్టగా పేరుపొందారంటున్నారు.
ఎవరు అధికారంలో ఉంటే...?
2019లో వైసీపీ అధికారంలోకి రాగానే వైసీపీ నేతలకు వెంకటేష్ నాయుడు చేరువయ్యాడు. వారికి అనుకూలంగా పనిచేశాడంటున్నారు. తర్వాత 2024లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ అధికారం కోల్పోయిన వెంటనే టీడీపీ నేతలతో కూడా కలసి తిరగడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. వారితో కూడా దిగిన ఫొటోలు ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియాలో పెడుతున్నారు. అయితే ఇతను ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ నేతలతో సంబంధాలు ఏర్పాటు చేసుకుని పనులు చేయించుకుంటూ, చేసి పెడుతూ వారికి లబ్ది చేకూరుస్తుంటాడన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. వెంకటేష్ నాయుడు ను విచారిస్తే తప్ప పూర్తి విషయాలు వెలుగుచూసే అవకాశాలు లేవంటున్నారు. అయితే ఇతని బ్యాక్ గ్రౌండ్ చూసి పోలీసు అధికారులే బిత్తరపోతున్నారు. రాజకీయ నేతలతో ఉన్న సంబంధాలపై ఆరా తీస్తున్నారు. మొత్తం మీద భారీ నగదుతో ఉన్న వెంకటేష్ నాయుడు వీడియో వైరల్ గా మారింది.
Next Story
