Mon Mar 16 2026 07:52:34 GMT+0530 (India Standard Time)
శ్రీవారి మెట్ల వద్ద చిరుత
తిరుమలలో మళ్లీ చిరుత కలకలం రేగింది. శ్రీవారి మెట్ల వద్ద నిన్న రాత్రి చిరుత కనిపించినట్లు భక్తులు చెబుతున్నారు

తిరుమలలో మళ్లీ చిరుత కలకలం రేగింది. శ్రీవారి మెట్ల వద్ద నిన్న రాత్రి చిరుత కనిపించినట్లు భక్తులు చెబుతున్నారు. శ్రీవారి మెట్ల మార్గం నుంచి చిరుత వెళ్లిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతుండటంతో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అప్రమత్తమయ్యారు. భక్తులను గుంపులుగా మాత్రమే తిరుమల కొండమీదకు అనుమతిస్తున్నారు.
నడక మార్గంలో...
తిరుమల నడక మార్గంలో క్రూర జంతువులు ఇటీవల కాలంలో ఎక్కువయిన నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇటు అలిపిరి మార్గంలోనూ, అటు శ్రీవారి మెట్ల వద్ద చిరుత, ఎలుగుబంట్లు వంటివి కనిపిస్తుండటంతో భక్తులు ఆందోళన చెందుతున్నారు. అందుకే చిన్న పిల్లల విషయంలో జాగ్రత్తలు పాటించాలని కోరుతున్నారు.
Next Story

