Wed Mar 18 2026 20:58:48 GMT+0530 (India Standard Time)
రవ్వలకొండనూ వైసీపీ నేతలు వదలడం లేదు
కర్నూలు జిల్లాలో వైసీపీ నేతల అక్రమ మైనింగ్ పై చర్యలు తీసుకోవాలని చంద్రబాబు చీఫ్ సెక్రటరీ సమీర్ శర్మకు లేఖ రాశారు

కర్నూలు జిల్లాలో వైసీపీ నేతల అక్రమ మైనింగ్ పై చర్యలు తీసుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు చీఫ్ సెక్రటరీ సమీర్ శర్మకు లేఖ రాశారు. వెంటనే చర్యలు తీసుకుని అక్రమ మైనింగ్ ను నిలిపేయాలని ఆయన లేఖలో కోరారు. బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసిన రవ్వలకొండను సయితం వైసీపీ నేతలు వదలలేదని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు.
బ్రహ్మంగారు....
రవ్వల కొండను కూడా తవ్వేస్తుండటంతో ఆ ప్రాంత వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. ఆ ప్రాంతవాసులకు ఆ కొండ సెంటిమెంట్ అని చెప్పారు. చరిత్ర కలిగిన ప్రాంతాలను కూడా వైసీపీ నేతలు మింగేస్తున్నారని, ప్రజలు పవిత్రంగా భావించే ప్రాంతాలను కూడా తమ అడ్డాలుగా మార్చుకుంటున్నారని చంద్రబాబు లేఖలో ఆరోపించారు.
Next Story

