Sun Mar 08 2026 00:32:57 GMT+0530 (India Standard Time)
నేడు వరద ప్రభావిత ప్రాంతాలకు చంద్రబాబు
గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో నేడు చంద్రబాబు పర్యటించనున్నారు. రెండు రోజుల పాటు ఆయన పర్యటన కొనసాగనుంది.

గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో నేడు చంద్రబాబు పర్యటించనున్నారు. రెండు రోజుల పాటు ఆయన పర్యటన కొనసాగనుంది. ఈరోజు ఉదయం 8 గంటలకు అమరావతిలో బయలుదేరి చంద్రబాబు కోనసీమ జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పర్యటిస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. కోనసీమ జిల్లాలోని పి. గన్నవరంలో చంద్రబాబు పర్యటించనున్నారు. అక్కడ బాధితులను పరామర్శించనున్నారు. పంట నష్టాన్ని కూడా పరిశీలించనున్నారు.
వరద బాధితులను....
చంద్రబాబు ఆచంట, పి. గన్నవరం, రాజోలు, పాలకొల్లు, నరసాపురం అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. రేపు అయోధ్యలంక, నాగుల్లంక, మనేపల్లి, అప్పన్నపల్లి, రాజోలు, దొడ్డిపట్ల , అబ్బురాజుపాలెం, గంగాధరపాలెంట, లక్ష్మీపురం, పొన్నపల్లి తదితర గ్రామాల్లో పర్యటించి బాధితులను పరామర్శిస్తారు. ప్రభుత్వం నుంచి వారికి అందిన సాయాన్ని అడిగి తెలుసుకుంటారు. ఎన్టీఆ ట్రస్ట్ భవన్ ద్వారా చంద్రబాబు సాయాన్ని ప్రకటించే అవకాశముంది.
Next Story

