Mon Mar 09 2026 11:06:18 GMT+0530 (India Standard Time)
Chandrababu : నేడు డోన్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం నంద్యాల జిల్లాలో పర్యటించనున్నారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం నంద్యాల జిల్లాలో పర్యటించనున్నారు. డోన్ నియోజకవర్గం, కొత్తబురుజు గ్రామంలో రైతులకు పట్టాదారుపాసుపుస్తకాలను పంపిణీ చేయనున్నారు. ఉదయం 10 గంటలకు అమరావతి నుంచి బయలుదేరి 11.20 గంటలకు కొత్తబురుజు గ్రామానికి చేరుకుంటారు. అక్కడ పార్టీ నేతలు, అధికారులు ముఖ్యమంత్రికి స్వాగతం పలుకుతారు.
రైతులతో ముఖాముఖి...
ఉదయం 11.35 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు గ్రామ సభలో పాల్గొని రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలను అందజేసి ప్రజావేదిక సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 2.05 గంటలకు స్థానిక రైతులతో ముఖ్యమంత్రి చంద్రబాబు ముచ్చటిస్తారు. అనంతరం 2.40 గంటలకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో నిర్వహించే సమీక్షా సమావేశంలో పాల్గొంటారు. సాయంత్రం 5.40 గంటలకు తిరిగి అమరావతి చేరుకుంటారు.
Next Story

