Thu Mar 19 2026 05:27:17 GMT+0530 (India Standard Time)
Chandrababu : రెండు రోజులు కుప్పంలోనే చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టిన తర్వాత తొలిసారి చంద్రబాబు తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో పర్యటించనున్నారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టిన తర్వాత తొలిసారి చంద్రబాబు తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో పర్యటించనున్నారు. నేటి నుంచి రెండు రోజుల పాటు ఆయన పర్యటన కొనసాగుతుంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించిన తర్వాత తొలిసారిగా కుప్పం నియోజకవర్గానికి చంద్రబాబు వస్తుండటంతో ఆయనకు పెద్దయెత్తున స్వాగత ఏర్పాట్లు తెలుగుదేశం పార్టీ నేతలు చేస్తున్నారు. మంగళ, బుధవారాల్లో ఆయన పర్యటన ఉంటుంది. వివిధ అభివృద్ధి పనులను ఆయన సమీక్షించనున్నారు. ఈరోజు హంద్రీనీవా కాల్వను పరిశీలిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.
బహిరంగ సభలో ప్రసంగం...
అలాగే ఆర్టీసీ బస్టాండ్ లో నిర్వహించే బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. మరుసటి రోజు కుప్పం నియోజకవర్గంలోనే ఉండి ప్రజల నుంచి వినతులను స్వీకరిస్తారు. చంద్రబాబు పర్యటన సందర్భంగా పెద్దయెత్తున వైసీపీ నేతలు పార్టీలో చేరే అవకాశాలున్నాయి. అందుకు తగిన ఏర్పాట్లను స్థానిక నేతలు పర్యవేక్షిస్తున్నారు. చంద్రబాబు తొలిసారి వస్తుండటంతో కుప్పం నియోజకవర్గంలో ఆయనకు స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలు, హోర్డింగ్ లు కట్టారు.
Next Story

