Sat Mar 07 2026 10:38:55 GMT+0530 (India Standard Time)
Chandrababu : నేడు ఢిల్లీకి వెళ్లనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు.ఈరోజు ఉదయం 10.50 గంటలకు ఢిల్లీ బయల్దేరి వెళతారు.ఢిల్లీలో జరిగే ప్రతిష్టాత్మక రైసినా డైలాగ్ 2026 సదస్సుకు హాజరై ప్రసంగించనున్నారు. భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ- అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రైసినా డైలాగ్ సదస్సు జరుగుతుంది. మద్యాహ్నం 2 గంటలకు ప్రగతి మైదాన్‌లోని భారత్ మండపంలో రైసినా డైలాగ్ 2026 సదస్సుకు హాజరవుతారు. ఈ సదస్సుకు ఫిన్ లాండ్ దేశాధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్ సహా 110 దేశాలకు చెందిన 2,700 మంది ప్రతినిధులు హాజరు కానున్నారు.
సదస్సులో పాల్గొన్న అనంతరం...
‘జియో పాలిటిక్స్- జియో ఎకనామిక్స్’ అంశం ఆధారంగా ఈ సదస్సులో సాగనున్న చర్చలు జరగనున్నాయి. సాంకేతికత- సుపరిపాలన-భవిష్యత్... అనే అంశాలపై కీలక ఉపన్యాసం చేయనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, రియల్ టైమ్ గవర్నెన్స్, డేటా ఆధారిత విధాన నిర్ణయాలు, డిజిటల్‌గా పౌర సేవలు అంశాలను వివరించనున్నారు. అడ్వాన్స్డ్ మాన్యుఫాక్చరింగ్ డెస్టినేషన్‌గా ఏపీని తీర్చిదిద్దేందుకు అనుసరిస్తున్న నిర్ణయాలను ముఖ్యమంత్రి చంద్రబాబు తెలపనున్నారు. ఈ పర్యటన తర్వాత తిరిగి హైదరాబాద్ కు చంద్రబాబు చేరుకుంటారు.
Next Story

