Tue Jan 20 2026 19:05:48 GMT+0000 (Coordinated Universal Time)
చంద్రబాబుకు జూనియర్ ఎన్టీఆర్ సెగ
వరద ప్రభావిత జిల్లాలో పర్యటిస్తున్న చంద్రబాబు కు జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల నుంచి ఇబ్బంది ఎదురవుతుంది

టీడీపీ చీఫ్ చంద్రబాబుకు జూనియర్ ఎన్టీఆర్ సెగ తగిలింది. కోనసీమ జిల్లాలో పర్యటిస్తున్న చంద్రబాబు కు తెలుగుదేశం పార్టీ అభిమానుల నుంచి ఇబ్బంది ఎదురవుతుంది. జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు, జెండాలతో ఆయన అభిమానులు పాల్గొంటున్నారు. జై ఎన్టీఆర్ నినాదాలతో చంద్రబాబు పర్యటన సాగుతుంది. దీంతో ఒకింత చంద్రబాబు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పైకి కనపడకుండా ఆయన నవ్వుపులుముకుని పర్యటన చేస్తున్నారు.
ఎక్కడకు వెళ్లినా...
జూనియర్ ఎన్టీఆర్ పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఆయనను పార్టీలోకి తీసుకురావాలని గత కొంత కాలంగా టీడీపీ అభిమానులు, కార్యకర్తలు కోరుతున్నారు. చంద్రబాబు ఎక్కడకు వెళ్లినా ఆయనకు జూనియర్ ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ నినాదాలు నింగినంటుటుండటంతో చంద్రబాబు ఇబ్బంది పడుతున్నారు. చివరకు వరద ప్రాంతాల్లో పర్యటిస్తున్న చంద్రబాబుకు జూనియర్ ఎన్టీఆర్ జెండాలతో స్వాగతం పలకడం విశేషం.
Next Story

