Sat Dec 06 2025 02:26:43 GMT+0000 (Coordinated Universal Time)
నేడు చంద్రబాబు సమీక్ష
వరస విజయాలతో ఊపు మీదున్న చంద్రబాబు నేడు సమావేశాలకు సిద్ధమవుతున్నారు.

వరస విజయాలతో ఊపు మీదున్న చంద్రబాబు నేడు సమావేశాలకు సిద్ధమవుతున్నారు. నేడు ప్రాంతీయ సమావేశం జరగనుంది. ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లా నేతలు ఈ సమావేశానికి హాజరవుతున్నారు. రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చంద్రబాబు చర్చించనున్నారు.
రెండు జిల్లాలు...
పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగే ఈ సమావేశంలో ముఖ్యనేతలు పాల్గొంటారని తెలిసింది. పట్టభద్రుల ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే కోటా లో ఎమ్మెల్సీ విజయంతో వచ్చే ఎన్నికల్లో విజయం దిశగా అడుగులు వేసేందుకు చంద్రబాబు నేతలతో సమీక్ష చేస్తున్నారు. నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు.
Next Story

