Thu Mar 19 2026 05:50:33 GMT+0530 (India Standard Time)
చంద్రబాబుకు తీపి కబురు
కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో ఓటమి నుంచి తేరుకోలేని చంద్రబాబుకు కొంత ఊరట లభించింది.

కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో ఓటమి నుంచి తేరుకోలేని చంద్రబాబుకు కొంత ఊరట లభించింది. ఈరోజు అక్కడ ఎంపీటీసీని టీడీపీ గెలుచుకుంది. కుప్పం నియోజకవర్గం దాసేగానూర్ ఎంపీటీసీని టీడీపీ గెలుచుకుంది. ఇక్కడ 569 ఓట్ల మెజారిటీతో తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది.
దారుణ ఓటమితో...
నిన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ దారుణంగా ఓటమిని చవిచూసింది. మనస్తాపం చెందిన చంద్రబాబు అసెంబ్లీకి కూడా రాలేకపోయారు. కానీ ఈరోజు ఎంపీటీసీని కైవసం చేసుకోవడతో కుప్పం తెలుగుదేశం పార్టీలో కొంత ఉత్సాహం నెలకొంది. నిన్న ఫలితాలతో నిరాశతో ఉన్న చంద్రబాబుకు ఈ ఎన్నిక ఫలితం తీపికబురే.
Next Story

