Tue Mar 10 2026 06:38:44 GMT+0530 (India Standard Time)
నేతలకు చంద్రబాబు వార్నింగ్
తెలుగుదేశం పార్టీ నేతలను చంద్రబాబు హెచ్చరించారు. పార్టీలో గ్రూపు రాజకీయాలను సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు.

తెలుగుదేశం పార్టీ నేతలను చంద్రబాబు హెచ్చరించారు. పార్టీలో గ్రూపు రాజకీయాలను సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు. పార్టీకి నష్టం చేస్తే ఎవరినీ ఉపేక్షించబోమని వార్నింగ్ ఇచ్చారు. నేతలందరూ ప్రజల్లోకి వెళ్లాల్సిందేనని చంద్రబాబు కోరారు. ప్రజల వద్దకు వెళ్లి ప్రభుత్వ వైఫల్యాలను వివరించాలని ఆదేశించారు.
నెలలో మార్పు రాకుంటే....
పనితీరులలో నెలలో మార్పు రాకపోతే చర్యలు ఉంటాయని చంద్రబాబు హెచ్చరించారు. ఇప్పటి వరకూ యాక్టివ్ గా లేని నేతలను తామను ఉపేక్షించేది లేదన్నారు. నేతల పనితీరుపై నివేదికలు తాను నివేదికలు తెప్పించుకుంటున్నానని చెప్పారు. నియోజకవర్గ స్థాయిలో పార్టీ కమిటీలను ఏర్పాటు చేయాలన్నారు. నెలలో పదిహేను రోజులు పార్లమెంటు కో - ఆర్డినేటర్లు క్షేత్రస్థాయిలో పర్యటనలు చేసి పార్టీని బలోపేతం చేయాలని సూచించారు.
Next Story

