Thu Mar 12 2026 16:55:38 GMT+0530 (India Standard Time)
Chandrababu : ఈ నెల 9న నంద్యాల జిల్లాకు చంద్రబాబు
ఈ నెల 9న నంద్యాల జిల్లాలో ఆంధ్రప్రదశే్ ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించనున్నారు

ఈ నెల 9వ తేదీన నంద్యాల జిల్లాలో ఆంధ్రప్రదశే్ ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించనున్నారు. నంద్యాల జిల్లాలోని డోన్ మండలం కొత్తబురుజులో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు ముఖ్యమంత్రి చంద్రబాబు పంపిణీ చేయనున్నారు. అంతకు ముందు రైతులతో ముఖాముఖి మాట్లాడనున్నారు.
పట్టాదారు పాస్ పుస్తకాలు...
చంద్రబాబు పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై ఉన్నతాధికారులు సమీక్ష నిర్వహించారు. రైతులతో ముఖాముఖి కార్యక్రమంతో పాటు పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ ఏర్పాట్లు, అనంతరం బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతున్నందున అందుకు అవసరమైన ఏర్పాట్లపై చర్చించారు. సభకు జిల్లా నలుమూలల నుంచి రైతులు హాజరయ్యే అవకాశముంది.
Next Story

