Wed Feb 25 2026 13:18:13 GMT+0530 (India Standard Time)
Chandrababu : నేడు మార్కాపురానికి చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు మార్కాపురంలో పర్యటించనున్నారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు మార్కాపురంలో పర్యటించనున్నారు. మార్కాపురం జిల్లాగా ప్రకటించిన తర్వాత తొలిసారి చంద్రబాబు పర్యటన ఉండటంతో పార్టీ నేతలు భారీ స్వాగత ఏర్పాట్లు చేస్తున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో చంద్రబాబు నాయుడు పాల్గొంటారు. వెలిగొండ ప్రాజెక్టు పనులను పరిశీలిస్తారు.
వెలిగొండ ప్రాజెక్టుకు...
వెలిగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ లైనింగ్ పనులకు చంద్రబాబు ఈ సందర్భంగా శంకుస్థాపన చేయనున్నారు. అధికారులతో పనుల పురోగతిపై చర్చించనున్నారు. అనంతరం మార్కాపురంలో భారీ బహిరంగ సభలో ఏర్పాటు చేశారు. ఈ సభకు జిల్లా నలుమూలల నుంచి పార్టీ నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు. పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు.
Next Story

