Sun Mar 08 2026 10:34:01 GMT+0530 (India Standard Time)
Chandrababu : పశ్చిమ బెంగాల్ ఘటనపై చంద్రబాబు ట్వీట్
పశ్చిమ బెంగాల్ లో రాష్ట్రపతి పర్యటనలో చోటు చేసుకున్న పరిణామాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు ట్వీట్ చేశారు

పశ్చిమ బెంగాల్ లో రాష్ట్రపతి పర్యటనలో చోటు చేసుకున్న పరిణామాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు ట్వీట్ చేశారు. ఇంటర్నేషనల్ సంతాల్ కార్యక్రమానికి వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ప్రోటోకాల్ కల్పించని రాష్ట్ర ప్రభుత్వం వైఖరిని ఆయన విమర్శించారు. తన పర్యటనలో ఆ రాష్ట్ర ప్రభుత్వం వ్యహరించిన తీరుపై ఆవేదన వ్యక్తం చేసిన ద్రౌపది ముర్ము, సర్వత్రా చర్చ జరుగుతుందన్నారు.
ఘటన దురదృష్టకరమని...
ఈ ఘటన దురదృష్టకరమని, రాష్ట్రపతి పదవిని అవమానించేలా బెంగాల్ ప్రభుత్వం వ్యహరించడం బాధకలిగించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఏ ప్రభుత్వం అయినా రాష్ట్రపతి పట్ల అత్యంత గౌరవ, మర్యాదలతో మెలగాల్సి ఉందన్న చంద్రబాబు, రాజ్యాంగ సంస్థలు రాజకీయాలకు అతీతంగా ఉంటాయని, వాటి పవిత్రతను కాపాడుకోవడం సమిష్టి విధి అంటూ సిఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు.
Next Story

