Tue Dec 30 2025 10:35:34 GMT+0000 (Coordinated Universal Time)
మరికాసేపట్లో గుండ్లపాడుకు చంద్రబాబు
గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గంలోని గుండ్లపాడులో హత్యకు గురైన చంద్రయ్య కుటుంబాన్ని చంద్రబాబు పరామర్శించనున్నారు

గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గంలోని గుండ్లపాడులో హత్యకు గురైన టీడీపీ నేత చంద్రయ్య కుటుంబాన్ని చంద్రబాబు పరామర్శించనున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు చంద్రయ్య హత్యను ఖండించారు. రాష్ట్రంలో అనేక మంది టీడీపీ నేతలు, కార్యకర్తలు వైసీపీ అరాచకత్వానికి బలయిపోయారని అన్నారు. జగన్ రెడ్డి పాలనపై తిరగబడుతున్న వారిని హతమారుస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు.
పదుల సంఖ్యలో కార్యకర్తలు....
ఒక్క పల్నాడులోనే అనేక మంది టీడీపీ నేతలు హత్యకు గురయ్యారని చంద్రబాబు అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మాచర్ల కు వెళ్లిన తమ పార్టీ నేతలు బొండా ఉమ, బుద్దా వెంకన్నలపై దాడి చేసిన విషయాన్ని చంద్రబాబు ఈ సందర్భంగా గుర్తు చేశారు. దాడులు చేసే వారికే జగన్ పదవులు కట్టబెడుతున్నారన్నారు. చంద్రయ్య కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని చంద్రబాబు హామీ ఇచ్చారు.
Next Story

