Sat Mar 21 2026 03:55:56 GMT+0530 (India Standard Time)
Chandrababu Naidu: నేడు ఈ జిల్లాల్లో పర్యటించనున్న ఏపీ సీఎం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు అనకాపల్లి, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో పర్యటించనున్నారు. ఆయన పర్యటన నిమిత్తం ఉండవల్లిలోని తన నివాసం నుంచి ఉదయం 10 గంటలకు బయలుదేరుతారు. అనకాపల్లి జిల్లా దార్లపూడి వద్ద పోలవరం ఎడమ కాల్వను ఉదయం 11.20 నుంచి 11.50 గంటల వరకు పరిశీలిస్తారు. మధ్యాహ్నం 12.35 గంటల నుంచి 1.30 గంటల వరకు చంద్రబాబునాయుడు భోగాపురం విమానాశ్రయాన్ని సందర్శించి విమానాశ్రయ పనుల పురోగతిని అధికారులతో సమీక్షించనున్నారు.
మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 4.30 గంటల వరకు సీఐఐ సదస్సులో చంద్రబాబు నాయుడు పాల్గొని.. అనంతరం మెడ్ టెక్ జోన్ కార్మికులతో సమావేశం కానున్నారు. సాయంత్రం 4.50 నుంచి 6.00 గంటల మధ్య విశాఖపట్నం ఎయిర్‌పోర్టు లాంజ్‌లో అధికారులతో సమావేశమై ఐదేళ్లుగా నిలిచిపోయిన ప్రాజెక్టుల స్థితిగతులపై సమీక్షిస్తారు. చంద్రబాబు నాయుడు రాత్రి 7.45 గంటలకు ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకోనున్నారు.
Next Story

