Fri Dec 05 2025 09:22:54 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : అమరావతిని అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తాం
ఈరోజు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో శాశ్వతంగా లిఖించదగినరోజు అని చంద్రబాబు అన్నారు.

ఈరోజు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో శాశ్వతంగా లిఖించదగినరోజు అని చంద్రబాబు అన్నారు. కేంద్ర ప్రభుత్వం పహాల్గాం దాడి తర్వాత తీసుకునే ప్రతి చర్యకు తాము అండగా ఉంటామని అన్నారు. అమాయక పర్యాటకులను ఉగ్రవాదులు కాల్చి చంపారన్నారు. మోదీ నాయకత్వంలో కొత్త భారత్ అవతరించనుందని చంద్రబాబు తెలిపారు. సంక్షేమం, అభివృద్ధి, పేదరిక నిర్మూలన ధ్యేయంగా మోదీ నిరంతరం పనిచేస్తున్నారని చెప్పారు. ఇండియా సేఫ్ లో ఉందంటే అందుకు ప్రధాని మోదీ కారణమని చంద్రబాబు అన్నారు. 2024 ఎన్నికల్లో మోదీ పై నమ్మకం, టీడీపీ, జనసేనపై ఉన్న విశ్వాసంతో 94 శాతం సక్సెస్ రేటు వచ్చిందని చంద్రబాబు అన్నారు. ఆర్థిక పరిస్థితి అగమ్యగోచరంగా ఉందని, అలాంటి పరిస్థితుల్లో వెంటిలేటర్ పై ఉన్న ఏపీకి నరేంద్ర మోదీ ఆక్సిజన్ ను అందించారని తెలిపారు. మోదీకి దేశమే మొదట అని అన్నారు.
గత ఐదేళ్ల పాటు...
రాజధాని లేని రాష్ట్రంగా గత ఐదేళ్ల పాటు విధ్వంసం జరిగిందని చంద్రబాబు అన్నారు. అమరావతి కేవలం నగరం కాదని, ఐదు కోట్ల ప్రజల సెంటిమెంట్ అని చంద్రబాబు తెలిపారు. ప్రజల ఆకాంక్షలకు, ఆశలకు ప్రతిరూపమని చంద్రబాబు తెలిపారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఇరవై తొమ్మిదివేల ఎకరాల భూమిని ఇరవై తొమ్మిది వేల మంది రైతులు ఉచితంగా ఇచ్చారన్నారు. రైతు కూలీలు, రైతు మహిళలు వీరోచితంగా పోరాడి తిరిగి అమరావతికి మంచి రోజులు వచ్చాయని చంద్రబాబు తెలిపారు. అమరావతి రైతుల ఉద్యమాన్ని తన జీవితంలో ఎన్నడూ చూడలేదని, మళ్లీ చూస్తానని అనుకోవడం లేదని చంద్రబాబు అన్నారు. పది నెలల్లోనే సవాళ్లను అధిగమించి మోదీ ఆశీస్సులతో అమారావతిని తిరిగి పట్టాలెక్కించామని చంద్రబాబు తెలిపారు. ఐదు కోట్ల మంది ప్రజలు మా రాజధాని అని చెప్పుకునే విధంగా అమరావతిని నిర్మాణం చేస్తామని చంద్రబాబు తెలిపారు.
అంతర్జాతీయ ప్రమాణాలతో...
అంతర్జాతీయ ప్రమాణాలతో రాజధాని అమరావతి నిర్మాణాన్ని సాగిస్తామని తెలిపారు. ముప్ఫయి శాతం గ్రీనరీ ఉంటుందని చెప్పారు. ఇన్నర్, అవుటర్ రింగ్ రోడ్డుతో పాటు వెల్ ప్లాన్డ్ సిటీగా అమరావతి ఉంటుందని చంద్రబాబు తెలిపారు. గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు నిర్మిస్తామని తెలిపారు. ప్రపంచదేశాలతో అమరావతిని అనుసంధానిస్తామని చంద్రబాబు చెప్పారు. హెల్త్ సిటీని క్రియేట్ చేస్తామని చెప్పారు. జపాన్ తరహాలో ఆహ్లాదకరమైన వాతావరణాన్నిఏర్పాటు చేస్తామని చంద్రబాబు తెలిపారు. కాలుష్యం లేకుండా పర్యావరణ రహితంగా రాజధానిని నిర్మిస్తామని చెప్పారు. ఇప్పటికే కొన్ని సంస్థలు వచ్చాయని మరికొన్ని సంస్థలు రావడానికి రెడీ గా ఉన్నాయని తెలిపారు. హైదరాబాద్ లో సైబరాబాద్ ను నాడు వాజ్ పేయి శంకుస్థాపన చేశారని, నేడు మోదీ అమరావతిలో క్వాంటమ్ సిటీని ఏర్పాటు చేయడానికి సహకరించాలని కోరారు. అమరావతితో పాటు అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని చంద్రబాబు అన్నారు.
Next Story

