ఏపీకి ఇరవై లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చాం : చంద్రబాబు
చిత్తూరు జిల్లాలోనే యాభై ఏళ్లు క్రితం తన రాజకీయ జీవితం ప్రారంభమైందని చంద్రబాబు తెలిపారు

చిత్తూరు జిల్లాలోనే యాభై ఏళ్లు క్రితం తన రాజకీయ జీవితం ప్రారంభమైందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తునే ఉన్నానని, దావోస్ కు వెళ్లి రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నానని తెలిపారు. గతంలో తాను టెక్నాలజీ అంటే అవహేళన చేశారని, ఇప్పుడు అదే టెక్నాలజీ మన సంపదను పెంచిందన్నారు. వచ్చే రోజుల్లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఏఐ డాక్టర్ ప్రతి ఒక్కరి ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టే పరిస్థితి వస్తుందన్నారు. సంజీవని ప్రాజెక్టు ద్వారా అందరి ఆరోగ్యం కాపాడేలా ప్రయత్నం చేస్తున్నామని చంద్రబాబు అన్నారు. గతంలో నిరంతర విద్యుత్ సరఫరా కోసం ఇబ్బందులు ఎదుర్కోనే పరిస్థితి నెలకొందని, ఇప్పుడు పీఎం సూర్యఘర్, కుసుమ్ పథకాల ద్వారా ఇళ్లపైనా, పొలాల్లో సోలార్ విద్యుత్ ఏర్పాటు చేసుకునే పరిస్థితి ఏర్పడిందని చెప్పారు.

