Mon Apr 06 2026 20:34:47 GMT+0530 (India Standard Time)
Andhra Pradesh : ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ లో ఏపీకి ఏడు ఒప్పందాలు
ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు

భారత్ మండపం లో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు పారిశ్రామికవేత్తలతో చంద్రబాబు సమావేశమయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూల వాతావరణంతో పాటు ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీలను కూడా చంద్రబాబు వారికి వివరించారు.
పెట్టుబడులు పెట్టేందుకు...
దీంతో కొందరు పారిశ్రామికవేత్తలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చారు. ఆంధ్రప్రదేశ్ లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటం, నైపుణ్యాభివృద్ధి కల్పన పై ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఏడు ఒప్పందాలు కుదిరాయి. ఐబీఎం, కాలిబో , నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ, వైసర్, ఐఐటీ మద్రాస్ తదితర సంస్థల తో ఒప్పందాలు జరిగినట్లు అధికారులు తెలిపారు.
Next Story

