Sun Dec 28 2025 09:28:28 GMT+0000 (Coordinated Universal Time)
చివరి అవకాశం నాకు కాదు.. ప్రజలకు : చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. లాస్ట్ ఛాన్స్ తనకు కాదని ప్రజలకు అని ఆయన అన్నారు.

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. లాస్ట్ ఛాన్స్ తనకు కాదని ప్రజలకు అని ఆయన అన్నారు. దెందులూరు నియోజకవర్గంలో విజయరాయి గ్రామంలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. బాబాయిని చంపినట్లుగానే తనను కూడా చంపొచ్చని జగన్ అనుకుంటున్నారన్నారు. లోకేష్ ను కూడా లక్ష్యం చేసుకున్నారని చంద్రబాబు ఆరోపించారు. వివేకానందరెడ్డి హత్య కేసును సుప్రీం తెలంగాణ సీబీఐ కోర్టుకు అప్పగించడంపై జగన్ సమాధానం చెప్పాలన్నారు. లేకుంటే రాజీనామా చేసి దిగిపోవాలని చంద్రబాబుడిమాండ్ చేశారు. వైసీపీ బెదిరింపులకు తాను భయపడేవాడిని కానని ఆయన అన్నారు.
జగన్ కు లాస్ట్ ఛాన్స్ కావాలి...
వైఎస్ జగన్ కు ఇదే చివరి అవకాశం కావాలని ఆయన ఆకాంక్షించారు. వైసీపీని మరోసారి గెలిపిస్తే రాజధానిగా అమరావవతి ఉండదని గుర్తుంచుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తన బాధ అంతా రాష్ట్ర ప్రల కోసమేనని, తన కోసం కాదని ఆయన సష్టం చేవారు. పోలవరం, అమరావతిని జగన్ నాశనం చేశారన్నారు. ఇప్పటికైనా ప్రజలు ఆలోచించుకుని వచ్చే ఎన్నికల్లో వైసీపీకి బుద్ధి చెప్పాలని చంద్రబాబు పిలుపు నిచ్చారు. అప్పుల భారం పెరిగిపోతుందని, ఈ రాష్ట్రాన్ని గాడిన పెట్టాలంటే పదేళ్ల సమయం పడుతుందని ఆయన అన్నారు.
Next Story

