Thu Jan 29 2026 15:08:26 GMT+0000 (Coordinated Universal Time)
ఆర్టీసీ బస్సు ఎక్కిన చంద్రబాబు.. మరి టికెట్?
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆర్టీసీ బస్సులో

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయడం విశేషం. అంబేద్కర్ కోనసీమ జిల్లా పర్యటనలో ఉన్న ఆయన.. భవిష్యత్తుకు గ్యారెంటీ మేనిఫెస్టో ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. ఆలమూరులో బస్సెక్కిన చంద్రబాబు జొన్నాడ వరకు ప్రయాణించారు. ఛార్జీ చెల్లించి కండక్టర్ నుంచి టికెట్ తీసుకున్నారు.
బస్సులో ఆయన మహిళా ప్రయాణికులతో మాట్లాడారు. వారి సమస్యలను తెలుసుకున్నారు. చంద్రబాబు టీడీపీ మహాశక్తి పథకం గురించి వారికి వివరించారు. తాము అధికారం లోకి వస్తే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని అన్నారు. ఒక్కసారిగా ఆయన బస్సులోకి రావడంతో ప్రయాణీకులు అందరూ ఆశ్చర్యపోయారు.
Next Story

