Sun Mar 15 2026 08:55:02 GMT+0530 (India Standard Time)
Chandrababu Oath : చంద్రబాబు అను నేను
చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. నాలుగోసారి ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టారు.

చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. నాలుగోసారి ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టారు. అతిరధ మహారధులు వివిధ ప్రాంతాల నుంచి తరలి రాగా చంద్రబాబు నాయుడు సరిగ్గా 11.27 గంటలకు నిర్ణయించిన ముహూర్తానికి ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆయన చేత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. విభజన ఆంధ్రప్రదేశ్ కు రెండోసారి ఆయన ముఖ్యమంత్రి అయి పాలన సాగించనున్నారు.
24 మంది మంత్రులతో...
ప్రధాని నరేంద్ర మోదీ హాజరయిన ఈ వేదిక నుంచి చంద్రబాబు మరోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలను అందుకున్నారు. కేంద్ర మంత్రులు, సినీ సెలబ్రటీలు, రాజకీయ ప్రముఖులతో పాటు అనేక మంది పారిశ్రామికవేత్తలు ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరై వీక్షించారు. చంద్రబాబు తో పాటు 24 మంది ఈ రోజు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులందరూ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. వీరితో పాటు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా సభ ప్రాంగణంలో ఉండగా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
Next Story

