Sun Mar 15 2026 10:20:17 GMT+0530 (India Standard Time)
విజయవాడకు చేరుకున్న నారా లోకేష్.. వాట్ నెక్స్ట్
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ గురువారం సాయంత్రం

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ గురువారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్‌లో అడుగు పెట్టారు. చంద్రబాబు అరెస్ట్ అనంతరం ఢిల్లీకి వెళ్లిన నారా లోకేష్ ఇన్ని రోజులూ అక్కడే ఉన్నారు. చాలా రోజుల తర్వాత ఆయన విజయవాడ చేరుకున్నారు. లోకేశ్‌కు స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు విమానాశ్రయానికి వచ్చారు. లోకేశ్ విమానాశ్రయం నుంచి ఉండవల్లిలోని తమ నివాసానికి వెళ్లారు. లోకేశ్ శుక్రవారం ఉదయం రాజమండ్రి వెళ్లనున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి కేంద్రకారాగారంలో ఉన్న చంద్రబాబుతో ములాఖత్ కానున్నారు.
ఇక నారా లోకేష్ ఉండవల్లిలోని నివాసంలో టీడీపీ ముఖ్య నేతలు కొల్లు రవీంద్ర, దేవినేని ఉమా, పట్టాభి, గద్దె రామ్మోమన్, పంచుమర్తి అనురాధ, చింతమనేని ప్రభాకర్, తదితరులతో లోకేష్ సమావేశం అయ్యారు.
Next Story

