Thu Jan 29 2026 01:47:13 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu naidu:అక్కడే చంద్రబాబు.. ఏ ప్రకటన చేస్తారో?
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీతో

Chandrababu naidu:టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీతో సీట్ల పంపకాలను ఖరారు చేసేందుకు ఢిల్లీలోనే ఉన్నారు. గురువారం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమైన తర్వాత టీడీపీ.. లోక్సభకు సంబంధించి బీజేపీకి 6 సీట్లు, అసెంబ్లీ స్థానాల్లో దాదాపు 10-11 సీట్లు కేటాయించినట్లు కేటాయించినట్లు వార్తలు వచ్చాయి. అయితే వీటిపై అధికారిక ప్రకటన రాలేదు. ఇక రాష్ట్రంలోని 25 లోక్సభ స్థానాల్లో టీడీపీతో పొత్తు పెట్టుకున్న జనసేనకు 3 సీట్లు ఇచ్చారు.
టీడీపీ నేత, రాజ్యసభ ఎంపీ కె.రవీంద్రకుమార్ మాట్లాడుతూ, వచ్చే ఎన్నికల్లో మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తాయని సూత్రప్రాయంగా అంగీకరించినట్లు చెప్పారు. మరో రౌండ్ చర్చలు జరిపి ఏవైనా విభేదాలు ఉంటే వాటిని పరిష్కరించనున్నారు. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా విషయంలో విభేదాల కారణంగా బయటకు వెళ్లిన ఆరేళ్ల తర్వాత టీడీపీ మళ్లీ ఎన్డీయే గూటికి చేరనుంది. బీజేపీ 2024 లోక్సభ ఎన్నికల్లో 370 సీట్లను దక్కించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందుకే ఏపీలో వీలైనన్ని స్థానాలను సొంతం చేసుకోవాలని అనుకుంటూ ఉంది. ఇంకా ఢిల్లీలోనే ఉన్న చంద్రబాబు ఏ ప్రకటన చేస్తారోనని ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు.
Next Story

