Fri Dec 05 2025 12:25:42 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : ఏపీలో నిరుద్యోగులు ఎంత మంది ఉన్నారో తెలుసా? వీరికి గుడ్ న్యూస్ త్వరలో.. నెలకు మూడు వేలు?
ఆంధ్రప్రదేశ్ లోని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం త్వరలోనే నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పనుంది.

ఆంధ్రప్రదేశ్ లోని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం త్వరలోనే నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పనుంది. నిరుద్యోగ భృతి చెల్లించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. అయితే ఎంత మంది నిరుద్యోగులున్నారు? ఎందరు డిగ్రీలు అంటే ఇంజినీరింగ్ తత్సమాన పరీక్షలను పూర్తి చేసిన వారు ఎంత మంది? అన్న దానిపై ఇప్పటికే సమాచారం సేకరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఇంటిటి ఇంటి సర్వే నిర్వహిస్తున్నారు. ఈ లెక్కలతో ఏపీలో నిరుద్యోగులు ఎంతమంది అన్న దానిపై క్లారిటీ రానుంది. అయితే నిరుద్యోగ భృతి ఇచ్చేవాళ్లకు ఇచ్చినా, అర్హత లేకుండా ఖాళీగా ఉండి పనిలేని వాళ్లకు పనులు కల్పించాలని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం యోచిస్తుంది.
మొత్తం ఇరవై ఆరు జిల్లాల్లో...
అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న ఇంటింటి సర్వేలో పనిచేసే వయసులో పనిలేని వాళ్లు రాష్ట్రంలో కోటిన్నర మంది ఉన్నట్లు సర్వేలో వెల్లడయినట్లు తెలిసింది. సచివాలయాల ఉద్యోగులు గత నెలలో ఈ సర్వే నిర్వహించారు. రాష్ట్రంలోని మొత్తం 26 జిల్లాల్లో దాదాపు 2.67 కోట్ల మంది వివరాలను ఉద్యోగులు సర్వే ద్వారా తెలుసుకున్నారు. అయితే ఈ సర్వేలో ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయని తెలిసింది. ఏ పనీ లేనివారు రాష్ట్రం మొత్తం మీద 1.56 కోట్ల మంది ఉన్నారు. అనకాపల్లి జిల్లాలో 5.43 లక్షల మంది, అనంతపురం జిల్లాలో 7.24 లక్షల మంది, అన్నమయ్య జిల్లాలో 5.22 లక్షల మంది, బాపట్ల జిల్లాలో 5.82 మంది, చిత్తూరు జిల్లాలో 6.10 లక్షల మంది ఉన్నారు. కోనసీమ జిల్లాలో 6.17 లక్షల మంది, తూర్పుగోదావరి జిల్లాలో 5.36 లక్షల మంది, ఏలూరు జిల్లాలో 6.37 లక్షల మంది, గుంటూరు జిల్లాలో 5.86 లక్షల మంది, కాకినాడ జిల్లాలో 6.49 లక్షల మంది, కృష్ణా జిల్లాలో 4 .20లక్షల మంది, కర్నూలు జిల్లాలో 7.62 లక్షల మంది, నంద్యాల జిల్లాలో 5.91 లక్షల మంది, ఎన్టీఆర్ జిల్లాలో 5. 99 లక్షల మంది వరకు ఉన్నట్లు సర్వేలో వెల్లడయింది.
అతి తక్కువగా ఈ జిల్లాలో...
పల్నాడు జిల్లాలో 5.87 లక్షల మంది, పార్వతీపురం మన్యం జిల్లాలో 3.38 లక్షల మంది, ప్రకాశం జిల్లాలో 7 లక్షల మంది, నెల్లూరు జిల్లాలో 7. 48 లక్షల మంది, సత్యసాయి జిల్లాలో 6.17 లక్షల మంది, శ్రీకాకుళం జిల్లాలో 7.56 లక్షల మంది, తిరుపతి జిల్లాలో 6.46 లక్షల మంది, విశాఖ జిల్లాలో 5.56 లక్షల మంది , విజయనగరం జిల్లాలో 6.93 లక్షల మంది, పశ్చిమ గోదావరి జిల్లాలో 5. 68మంది, వైఎస్సార్ జిల్లాలో 6.28 మంది, అల్లూరి జిల్లాలో అత్యల్పంగా 4.89 లక్షల మంది ఉన్నారు. పని లేని వారిని గుర్తించిన ప్రభుత్వం వారందరికీ నచ్చిన రంగంలో నైపుణ్యాలు పెంచుకునేలా శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది.
నిరుద్యోగ భృతి వరకూ...
విద్యార్హతలు ఉన్న వారికి ఇళ్ల నుంచే పని చేసుకునేలా వివిధ సంస్థల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించాలని ప్రభుత్వం భావిస్తుంది. అయితే ఇందులో డిగ్రీ పూర్తి చేసిన వారికి నిరుద్యోగ భృతి ఇవ్వడంపై ఒక ప్రకటన చేయనుంది. ఎన్నికలకు ముందు కూటమి నుంచి చంద్రబాబు నాయుడు తాము అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగులకు నెలకు మూడు వేల రూపాయల భృతి ఇస్తామని ప్రకటించిన నేపథ్యంలో ఈ ఇంటింటి సర్వేను నిర్వహించినట్లు సమాచారం. ఈ నిరుద్యోగ భృతికి సంబంధించిన నిధులు మొన్నటి బడ్జెట్ లో పెట్టకపోయినా త్వరలోనే అమలు చేయాలన్న నిర్ణయంతో చంద్రబాబు ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. అందుకోసమే ఈ లెక్కలను సేకరించింది. అర్హత లేని వారికి మాత్రం శిక్షణ ఇచ్చిపనికల్పించనున్నారు.
Next Story

