Chandrababu : ఆఫీసులో ఉండేది తక్కువ.. బయట తిరిగేదే ఎక్కువ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంపదను సృష్టించడానికి తనకు శక్తికి మించి ప్రయత్నాలు చేస్తున్నారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంపదను సృష్టించడానికి తనకు శక్తికి మించి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన కార్యాలయంలో ఉండేది తక్కువ. బయట తిరిగేది ఎక్కువ. అదే ఆయన ప్రత్యేకత. తన హయాంలో ఏదో జరగాలన్న తాపత్రయం చంద్రబాబులో అడుగడుగునా కనిపిస్తుంది. ఆయన నిరంతరం దేశ, విదేశాల్లో పర్యటిస్తూ రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ పదహారు నెలల కాలంలో చంద్రబాబు నాయుడు కాళ్లకు బలపం కట్టుకుని తిరుగుతున్నారు. తరచూ ఢిల్లీకి వెళుతూ రాష్ట్రానికి కావాల్సిన ప్రాజెక్టులు, ప్రయోజనాలపై ప్రధాని, కేంద్ర మంత్రులతో చర్చిస్తున్నారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆర్థిక పరిస్థితులను వివరించి ఆంధ్రప్రదేశ్ కు మేలు చేకూర్చేలా ఏదో ఒక ప్రాజెక్టును తెస్తూనే ఉన్నారు. కేంద్ర ప్రాయోజిత పథకాలను కూడా రాష్ట్రానికి తెస్తూ కొంత ఆర్థిక వెసులు బాటు కలిగేలా చేస్తున్నారు.

