Thu Jan 29 2026 07:21:46 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : కేబినెట్ లో మంత్రులకు మందలింపు.. అలా చేయకుంటే?
మంత్రి వర్గ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొందరు మంత్రుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది

ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొందరు మంత్రుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. మంత్రులు తమకు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడం లేదని, ఇలాగయితే తాను పునరాలోచన చేయాల్సి ఉంటుందని హెచ్చరించినట్లు సమాచారం. మంత్రి పదవి ఎవరికీ శాశ్వతం కాదని గుర్తుంచుకోవాలని చంద్రబాబు ఒకింత సీరియస్ గానే సమావేశం ముగిసే సమయంలో అన్నట్లు సమాచారం.
విభేదాల పరిష్కారానికి...
మంత్రులు పాలనపారమైన విషయాల్లో లోతైన అవగాహన అలవర్చుకోవాలని, అలాగే పార్టీ విషయాలను కూడా పట్టించుకోవాలని సూచించారు. పార్టీసభ్యత్వ నమోదు విషయంలో అలసత్వం ప్రదర్శించవద్దని హెచ్చరించారు. అలాగే కూటమి పార్టీల నేతల మధ్య సమన్వయం చేసుకునే బాధ్యతను కూడా మంత్రులు తీసుకోవాలన్నారు. కొన్ని నియోజకవర్గాల్లో కూటమి పార్టీల నేతల మధ్య నెలకొన్న విభేదాలను అక్కడికక్కడే పరిష్కరించాలని, వాటిని పెంచిపెద్దవి చేయవద్దని కూడా చంద్రబాబు గట్టిగానే చెప్పినట్లు తెలిసింది. మంత్రులకు మందలింపులు ఈ సమావేశంలో చంద్రబాబు బాగానే చేసినట్లు చెబుతున్నారు.
Next Story

