Tue Dec 16 2025 12:31:22 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : చంద్రబాబు నిర్ణయాలను తమ్ముళ్లే తప్పుపడుతున్నారా?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 1995 నాటి నుంచి 2025 వరకూ ఏ మాత్రం రాజకీయంగా మారలేదు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 1995 నాటి నుంచి 2025 వరకూ ఏ మాత్రం రాజకీయంగా మారలేదు. ఆయన రాజకీయ నిర్ణయాలను వేగంగా తీసుకోలేకపోతున్నారని సొంత పార్టీ నేతలే అంటుంటారు. వేగంగా నిర్ణయాలు తీసుకోకపోవడం ఒకరకంగా చంద్రబాబు నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. అలాగే అనేక సార్లు టీడీపీ ఓటమి పాలయింది. అయినా సరే చంద్రబాబు నాయుడు వ్యవహారశైలిలో మార్పు రాలేదు. గతంలో తక్కువ నియోజకవర్గాలు ఉన్నప్పుడు అదే తీరు. ఇప్పుడు 98 శాతం స్ట్రయిక్ రేట్ ఇచ్చినప్పటికీ అదే రకంగా వ్యవహరిస్తుండటం పార్టీలో చర్చనీయాంశమైంది. చంద్రబాబు నాయుడు స్వతహాగా పార్టీ పరంగా క్విక్ డెసిషన్ తీసుకోలేరు.
తిరువూరు తలనొప్పి...
ఇందుకు ఉదాహరణ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వర్సెస్ ఎంపీ కేశినేని చిన్ని వర్గం మధ్య చిచ్చు చల్లారలేదు. ఎన్ని సార్లు వార్నింగ్ లు ఇచ్చినా తిరువూరు పంచాయతీకి తెరపడలేదు. తాజాగా వరుస పోస్టులతో ఎంపీ వర్గానికి ఎమ్మెల్యే కొలికపూడి నిద్రలేకుండా చేస్తున్నారు. ఇటీవల కొలికపూడి ఓ మహిళతో ఉన్న ఫోటోను టిడిపి నేతలు విడుదల చేయడం టిడిపి సోషల్ మీడియా గ్రూపుల్లో చక్కర్లు కొట్టింది. కౌంటర్ గా ఇద్దరు నేతల ఫోటోలను ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు పోస్టు చేశారరు. తిరువూరుకు చెందిన బుడ్డయ్య , చెరుకూరి రాజేశ్వరరావులు మహిళలతో ఉన్న ఫోటోలను విడుదల చేసిన కొలికపూడి రాజేశ్వరరావు ఇల్లు కూడా చూస్తారా...? అంటూ పోస్టులు పెట్టారు. దీంతో కొలికపూడి పై ఎంపీ చిన్ని వర్గం రగిలిపోతుంది. ఏఐ ఫోటోలు విడుదల చేశారంటూ ఎంపీ కేశినేని చిన్ని వర్గం మండిపడుతుంది.
వైసీపీ నేతలను తెచ్చుకుని...
మరొకవైపు నెల్లూరుతో పాటు మిగిలిన ప్రాంతాల్లో వైసీపీ నేతలను పార్టీలో చేర్చుకోవడంపై కూడా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఏడాది కాలం కూడా లేని పదవుల కోసం ఇతర పార్టీల నుంచి నేతలను తీసుకు వచ్చి అప్పటి వరకూ పనిచేసిన వారికి ఇబ్బందులు పెడతారా? అన్న ప్రశ్న క్యాడర్ నుంచి వస్తుంది. గతంలో వైఎస్ జగన్ కూడా ఇలాగే చేసి సొంత పార్టీ క్యాడర్ నుంచి అసంతృప్తిని ఎదుర్కొన్నారు. ఆ విషయాన్ని గుర్తు చేస్తూ కొందరు టీడీపీ అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు మరో మూడు నెలలు మాత్రమే గడువు ఉంది. ఈ సమయంలో వైసీపీ నుంచి నేతలను అరువు తెచ్చుకుని తమపై రుద్దుతారా? అని నెట్టింట తెలుగు తమ్ముళ్లు ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద నాటికి.. నేటికి చంద్రబాబు రాజకీయ నిర్ణయాల్లో మాత్రం మార్పు లేదన్నది పార్టీ నేతల నుంచి వినిపిస్తున్న మాట.
Next Story

