Tue Jan 20 2026 11:40:59 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : పండగ రోజు కూడా చంద్రబాబు సమీక్ష
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు పౌరసరఫరాల శాఖపై సమీక్ష నిర్వహించారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు పౌరసరఫరాల శాఖపై సమీక్ష నిర్వహించారు. దసరా పండగ రోజు ఉండవల్లిలోని తన నివాసంలో అధికారులతో సమీక్ష జరిపారు. ఈ సమీక్షకు మంత్రి నాదెండ్ల మనోహర్ హాజరయ్యారు. ప్రధానంగా నిత్యావసర వస్తువుల ధరలపై ఆయన సమీక్ష జరిపారు. ప్రజలపై ధరల భారం తగ్గించేందుకు తీసుకున్న చర్యలను ఈ సమీక్షలో అధికారులు చంద్రబాబు కు వివరించారు.
నిత్యావసర వస్తువుల ధరలు...
డిమాండ్కు తగినట్లుగా నిత్యావసరవస్తువుల దిగుమతి చేసుకోవాలని, దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని చర్యలు ఉండాలని చంద్రబాబు అధికారులకు సూచించారు. రేషన్ కార్డు దారులకు చౌకధరల దుకాణాల ద్వారా తక్కువ ధరలకు నిత్యావసర వస్తువులను అందచేస్తున్నప్పటికీ బయట మార్కెట్ లో ధరల నియంత్రణపై చర్యలు ఎలా తీసుకోవాలన్న దానిపై అధికారులతో చంద్రబాబు సుదీర్థంగా చర్చించారు.
Next Story

