Sat Dec 13 2025 22:33:06 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : శ్రీ సత్యసాయి జిల్లాలో చంద్రబాబు పర్యటన నేడు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు సత్యసాయి జిల్లాలో పర్యటించనున్నారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు సత్యసాయి జిల్లాలో పర్యటించనున్నారు. సత్యసాయి జిల్లా పెద్దన్నవారి పల్లిలో చంద్రబాబు పర్యటిస్తారు. పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లను చంద్రబాబు పంపిణీ చేస్తారు. అనంతరం ప్రజాదీవెన కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారు. అనంతరం టీడీపీ కార్యకర్తల సమావేశంలో చంద్రబాబు పాల్గొని పార్టీ కార్యకర్తల సంక్షేమానికి తీసుకుంటున్న చర్యలపై వివరించనున్నారు. పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇవ్వనున్నారు.
నేడు లండన్ కు చంద్రబాబు...
ఈరోజు రాత్రికి చంద్రబాబు నాయుడు లండన్ కు బయలుదేరి వెళ్లనున్నారు. సతీమణి నారా భువనేశ్వరి తో కలసి చంద్రబాబు లండన్ వెళ్లనున్నారు. వ్యక్తిగత పర్యటన నిమిత్తం లండన్ కు బయలుదేరి వెళ్లనున్నారు. పారిశ్రామికవేత్తలతో సమావేశం కానున్నారు. ఈ నెలలో విశాఖలో జరగనున్న సీఐఐ సదస్సుకు హాజరు కావాలని కోరనున్నారు. సతీమణి నారా భువనేశ్వరి ఇనిస్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ డిస్టింగ్విష్ట్ ఫెలోషిప్ అవార్డును తీసుకునే కార్యక్రమంలో కూడా చంద్రబాబు పాల్గొంటారు.
Next Story

