Thu Jan 16 2025 01:14:44 GMT+0000 (Coordinated Universal Time)
ChandraBabuNaidu and Pavankalyan: ఢిల్లీకి వెళుతున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. తేల్చేయబోతున్నారా?
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, నారా చంద్రబాబు నాయుడు నేడు
ChandraBabuNaidu and Pavankalyan:జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, నారా చంద్రబాబు నాయుడు నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. బుధవారం నాడు కూడా వీరిరువురు ఉండవల్లిలో సమావేశమై అభ్యర్థుల జాబితాలు, బీజేపీతో పొత్తుపై చర్చించారు. రెండు గంటలకు పైగా సాగిన చర్చల్లో బీజేపీతో పొత్తు ఖరారు అయిన తర్వాతే పెండింగ్లో ఉన్న సీట్ల జాబితాను విడుదల చేయాలని నిర్ణయించినట్లు నేతలు తెలిపారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు ఇరువురు నేతలు బీజేపీ నాయకత్వాన్ని కలిసేందుకు నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు.
చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్.. బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమవబోతున్నారు. ఈ భేటీలో పొత్తుపై ఓ క్లారిటీ రానుంది. చంద్రబాబు ఇదివరకే అమిత్ షాను కలిశారు. నేటి భేటీలో పొత్తుపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే తొలి జాబితాను ప్రకటించిన టీడీపీ-జనసేన కూటమి రెండవ జాబితాపై కసరత్తు చేస్తోంది. అభ్యర్థుల రెండో జాబితా నేపథ్యంలో బీజేపీతో పొత్తుపై దాదాపు గంటన్నరపాటు ఇరువురు చర్చించినట్టు సమాచారం. బీజేపీ కోరుకునే స్థానాలు ఏవా అని టీడీపీ-జనసేన కూటమిలో కూడా కాస్త సస్పెన్స్ నెలకొంది.
Next Story