Fri Dec 05 2025 12:40:07 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : ప్రధాని మోదీతో చంద్రబాబు భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. కొద్దిసేపటి క్రితం ఢిల్లీకి చేరుకున్న చంద్రబాబు నాయుడు కొద్దిసేపటి క్రితం ప్రధాని మోదీతో సమావేశమై రాష్ట్ర పర్యటనపై చర్చించారు. ఈ నెల 16వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. శ్రీశైలం, కర్నూలులో పర్యటిస్తారు. జీఎస్టీ సంస్కరణలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఆయన భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు.
నవంబరు నెలలో...
కర్నూలు లో జరిగే రోడ్ షోలో కూడా పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా ప్రధాని మోదీని ఆహ్వానించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధాని మోదీని కలిశారు. అలాగే నవంబరులో విశాఖలో జరిగే పార్టనర్ షిప్ సమ్మిట్ కు కూడా రావాలని చంద్రబాబు కోరనున్నారు. రేపు కూడా చంద్రబాబు ఢిల్లీలోనే ఉంటారు. దీంతోపాటు రాష్ట్ర రాజకీయ పరిణామాలతో పాటు రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులు, నిధులపై కూడా ప్రధాని మోదీతో చర్చించే అవకాశముంది.
Next Story

